AP Supplementary Exam Fee Dates 2023
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు-2023 మార్చి 15వ తేదీన ఇంటర్ మొదటి సంవత్సరం, 16వ తేదీన ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు ప్రారంభమైయ్యాయి. ఏప్రిల్ 4వ తేదీన పరీక్షలు ముగిసిన విషయం అందరికీ తెల్సిందే.

ఇంటర్ మొదటి మరియు 2వ సంవత్సరం విద్యార్థులు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజరయ్యరు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,84,197 మంది కాగా 2వ సంవత్సరం విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు. పరీక్షల కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పరీక్షలు ముగియడంతో ఇంటర్ బోర్డ్ పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ భావిస్తోంది. అనుకున్న విధంగానే ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఈ రోజు అనగా ఏప్రిల్ 26వ తేదీన ఇంటర్ ఫలితాలను విద్య శాఖ మంత్రి బొస్త సత్య నారాయణ గారు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోండి

ఏపీలో ఇంటర్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ రిలీజ్ చేశారు. ఫస్టియర్ లో 61 శాతం, సెకండియర్ లో 72 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ఫలితాల్లో ప్రతిసారి లాగానే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారని తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు Apply చేసుకోవాలనుకునే వారు రేపటి నుండి మే 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ ఫీజు నీ మే 3వ తేది నుంచి కట్టుకోవచ్చు అని మంత్రి బోస్తా సత్య నారాయణ చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకూ, సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ జూన్ 5 నుంచి 9 వరకూ నిర్వహిస్తామన్నారు. మరింత సమాచారం కోసం క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి తెలుసుకోగలరు.
More details link : click here