TS Inter Results 2023 Link | తెలంగాణ ఇంటర్ 1st 2nd Year ఫలితాలు విడుదల

TS Inter Results 2023

విద్యార్థులు, తల్లిదండ్రుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ తెలంగాణ ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.  విద్యాశాఖ మంత్రి సభిత ఇంద్ర రెడ్డి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ సంవత్సరం విద్యార్దులు బాగా కష్టపడి చదివారు అందువల్ల పాస్ పర్సంటేజ్ కూడా గత సంవత్సరం కంటే ఎక్కువ వచ్చింది అని మంత్రి చెప్పారు. ఫలితాలు చూసుకొనే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోండి.

Results link : click here

తెలంగాణ‌లో ఇంట‌ర్ ఇంట‌ర్ మొదటి , 2వ సంవ‌త్స‌రం కలిపి దాదాపు 9,48,010 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ప‌రీక్ష‌లు మార్చి 29వ తేదీతో (బుధవారం) ముగిసిన విషయం అందరికీ తెలిసిందే.

ఇంట‌ర్ 2వ సంవత్సరం పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 4,02,630 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫస్టియర్‌ ఇంటర్‌కు 4,82,619 మంది ఉన్నారు. ఇక‌ ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మాత్రం మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు.  ఫలితాలు చూసుకొనే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోండి.

తెలంగాణ ఎంసెట్ 2023 పరీక్ష తేదీలు మారాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. నీట్, టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు మే 7 నుంచి 11 వరకు జరగాల్సి ఉంది. అయితే మారిన షెడ్యూల్ ప్రకారం మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎన్. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.

మే 7న నీట్ (యూజీ) పరీక్ష, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. మే 10, 11 తేదీల్లోనే ఈ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

తెలంగాణ ఇంటర్ పరీక్షలు ముగియడంతో ఇంటర్ బోర్డ్ పేపర్ల వాల్యుయేషన్ పై దృష్టి సారించింది.  గత వారంలోనే వాల్యుయేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. అనుకున్న విధంగానే అతి తక్కువ సమయంలో వాల్యువేషన్ పూర్తి చేసి రిజల్ట్స్ నీ విడుదల చేసింది. మీరు రిజల్ట్స్ నీ చెక్ చేసుకోవాలని క్రింద ఇచ్చిన లింక్ నీ క్లిక్ చేసి హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోగలరు. అలాగే జూన్​ 1వ తేదీ నుంచి తిరిగి ఇంట‌ర్ తరగతులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

Results link : click here

ఈ ఏడాది 35 లక్షల ప్రశ్నాపత్రాలకు ఆన్‌లైన్‌లో మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించామని మిత్తల్‌ తెలిపారు. టెన్త్‌ పరీక్షలు పూర్తయ్యేనాటికే ఇంటర్‌ కాలేజీల అఫ్లియేషన్‌ ప్రక్రియ ముగించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అఫ్లియేషన్‌ లేకపోతే పరీక్షకు బోర్డ్‌ అనుమతించదనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈసారి ముందే అంగీకారం తీసుకునే వీలుందన్నారు. ఇక ఇంటర్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

ఫలితాలు చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోండి

Results link : click here

Leave a Comment