AP Govt JobsAP Local JobsLatest Govt jobs

AP 10th ఫలితాలు విడుదల 2024 | Latest AP 10th Results 2024 | AP SSC Results 2024 Official

ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాల కోసం విద్యార్దులు మరియు వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అనుకున్న సమయం కంటే ముందుగా పరీక్ష ఫలితాలను (AP SSC Results 2024) ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఫలితాలను విద్యశాఖ మంత్రి ఈ రోజు విడుదల చేశారు.

AP 10th Results 2024

ఈ ఏడాది ఏపీ 10వ తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,30,000 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు ముగియగానే అధికారులు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించి పూర్తి చేశారు. విద్యార్థుల జవాబుపత్రాలను మరోసారి పరిశీలించి, మార్కుల నమోదు పూర్తి చేశారు. అన్ని మార్కులను డిజిటల్ ప్రాసెస్ రూపంలో అప్లోడ్ చేశారు.

10వ తరగతి ఫలితాలను ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఫలితాలను మీ మొబైల్ లో చెక్ చేసుకోగలరు. ఫలితాలు చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోగలరు.




AP Results Link: Click Here




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!