AP10th Results 2023
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో 10th రిజల్ట్స్ ఈ రోజు రేపు అని సోషల్ మీడియా లో బాగా ప్రచారం జరుగుతుంది. కొన్ని వెబ్సైట్ లో ఫలితాలు వచ్చేశాయి వెంటనే చెక్ చేసుకోండి అని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. దీనిపై SSC బోర్డ్ స్పందించింది.

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2023 ఏప్రిల్ 18వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,349 పరీక్ష కేంద్రాల్లో 6.64 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనానికి కూడా ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 26వ తేదీ కి విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ చేపట్టనున్నారు. దాదాపు 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గోన్నారు. ఫలితాలు ఆలస్యం కాకుండా వీలైనంత త్వరగా విడుదల చేస్తాం అన్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం అంతా అబద్దమే అని SSC బోర్డ్ ప్రకటించింది. త్వరలో ఫలితాల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఫలితాలను చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను ఒకసారి క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.
Results link : click here